బిజేపిలో చేరిన పడాల శ్రీనివాసరావు – కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేఎన్ఆర్…

గాజువాక :- గాజువాక పాతరర్నవానిపాలెం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. గాజువాక శ్రీనగర్ అఫీషియల్ కోలనీకి చెందిన పడాల శ్రీనివాసరావు పార్టీలో చేరారు. ఆయనకు నియోజకవర్గం కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనకు ఆకర్షితులై తన అనుచరులతో కలసి పార్టీలో చేరానని అన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో చేరడానికి సహకరించిన బిజేపి నాయకులు బగ్గు ఈశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గూటూరు శంకరరావు,వి.రోహిణి,వర్రి లలిత,భువనేశ్వరి,సోంబాబు,నాగేశ్వరరావు,ముసలయ్య,రంగనాయకులు,జగదీష్, మనోహర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment