
ఎస్ . రాయవరం :- మండలంలోని గుడివాడ రెవిన్యూ పరిధిలో సర్వే నెంబరు 349 ఏ/బి లో గెడ్డ వాగు ఆక్రమణకు గురవుతుందని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగా మంగళవారం రెవెన్యూ ,ఇరిగేషన్ అధికారులు కలిసి విచారణ ప్రారంభించారు.ఈ సందర్భంగా కొందరు రైతులు అక్కడకు వచ్చిన గెడ్డవాగులోని గతంలోని పట్టాలు ఇవ్వడం జరిగిందని అయితే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కావాలని అక్రమంగా చెరువులు తవ్వడం జరుగుతుందని దీనివల్ల మిగతా రైతులు అందరం ఇబ్బందులు పడతారని తక్షణము ఆ చెరువులు తవ్వకాలను నిలిపివేయాలని అధికారులు కోరారు.గెడ్డవాగులో తవ్వకాలు గుర్తించమని ఆక్రమణలు జరగకుండా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ (రీ సర్వే) సూరి ఇరిగేషన్ జేఈ అమీనా భాను, మండల సర్వేయర్ నారాయణమూర్తి రైతులు తదితరులు పాల్గొన్నారు.

