
మంచినీటి సౌకర్యం కల్పించాలని ఎంపీడీవోకు మెమోరండం ద్వారా వినతి…
అరకులోయ :- అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం మాదల గ్రామపంచాయతీకి చెందిన మారుమూల గ్రామం రక్తకండి మరియు దోమల జోరు లో భారతదేశం స్వాతంత్రం వచ్చి నేటికి 78 ఏళ్లు గడుస్తున్నా కనీస మంచినీటి సౌకర్యం కలిగించ లేని దుస్థితి నెలకొని ఉందని శుక్రవారం మాదల పంచాయతీ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు పర్యటనలో భాగం గా వెలుగులోకి వచ్చిన సమస్యపై అరకులోయ ఎంపీడీవోకు మెమోరాండం ద్వారా వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తకండీ దోమల జోరు గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న మంచినీటి సమస్యను సత్వర పరిష్కారం జరిగేలా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎంపీడీవో వీసం ప్రసాద్ చెప్పినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కుమిడి రమేష్,రామన్న,అప్పన్న,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

