మనడబ్బులు,మనలెక్కలు పై ర్యాలీ, అవగాహన సదస్సులు : వెలుగు ఏపీఎం సులోచన దేవి ఆధ్వర్యంలో…

గంట్యాడ :- గంట్యాడ మండలంలో అన్ని గ్రామ సంఘాల్లో శుక్రవారం మనడబ్బులు మన లెక్కలు సూపర్ నారీ యాప్ పై ర్యాలీలు,అవగాహన సదస్సులు వెలుగు ఏపీఎం సులోచన దేవి ఆధ్వర్యంలో జరిగాయి.ఈ సందర్భంగా ఏపీఎం సులోచన దేవి మాట్లాడుతూ, మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమం పై ప్రతి ఒక్క సభ్యురాలికి అవగాహన కల్పిస్తూ సూపర్ నారి యాప్ ని ప్రతి ఒక్క సభ్యురాలు డౌన్లోడ్ చేసుకొని వారి యొక్క వ్యక్తిగత పొదుపులో అప్పులు వాళ్ళు అంతటి వాళ్లు చూసుకునేటట్లుగా అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీలు సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు .ప్రతి ఒక్క సభ్యుల పొదుపు లెక్కలు అనేవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది సరిదిద్దుకోవడం కోసం కూడా ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు.ఈ యాప్ ఉన్న సభ్యురాలు యొక్క వ్యక్తిగత వివరాలతో పాటుగా సంఘం యొక్క ఆర్థిక లావాదేవీలు సమాచారం కూడా తెలుసుకోవడం వల్ల పారదర్శకత మరియు జవాబుదారితనం పెరుగుతాయని ఏపీఎం సులోచన దేవి అన్నారు..ఈ అవగాహన సదస్సులు,ర్యాలీల లో వెలుగు సీసీలు,వివో ఎల్ ఎస్ హెచ్ సభ్యులు పాల్గొన్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment