
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎం రమేష్..
మునగపాక :- ఎలమంచిలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో “కిషోర్ వికాసం వేసవి కాల సమావేశ” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం” 11 సంవత్సరంలో నుండి 18 సంవత్సరం” లోపు గల బాల బాలికలకు జీవన నైపుణ్య అభివృద్ధి,రుతుస్రావం పరిశుభ్రత,ఆరోగ్యం,యోగ,విద్య,భవిష్యత్ పై అవగాహన స్మార్ట్ ఫోన్స్,ఫోక్సో,గృహహింస చట్టాలపై అవగాహన డ్రగ్స్ వంటి విషయాలపై తేదీ 01.05.2026 నుండి తేదీ 10.06.2026 వరకు వారంలో రెండు రోజులు మంగళవారం మరియు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఆడ పిల్లలతో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు మగ పిల్లలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అర్థం అయిన భాషలో అన్ని విషయాలపై అవగాహన కల్పించి 15 మంది పిల్లలకు తక్కువ లేకుండా 20 మంది పిల్లలకు మించకుండా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి పిల్లల సమస్యలు లేని గ్రామంగా చేయడం దీని ముఖ్య ఉద్దేశం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్.రమేష్,జిల్లా బాలల సంరక్షణ అధికారి హాజరై మాట్లాడుతూ కిషోరి వికాసం “సెషన్ 11 లో భాగంగా మత్తుపదార్ధాలకు దూరంగా ఉండడం” కోసం పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది.బాలల అవసరాలు చదువు చదువుకు కావలసిన పుస్తకాలు,ఆరోగ్యం, ఆడుకోవడానికి కావలసిన వస్తువులు,మానసిక స్థిరత్వం వంటి విషయాలను, పిల్లలపై జరుగుతున్న వేధింపులు,పిల్లల హక్కులకు భంగం కల్పించే విధంగా ఉండటం,చదువు మధ్యలో ఆపివేయడం,ఆర్థిక పరిస్థితులు,ఫీర్ గ్రూప్స్ ప్రెషర్,స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉంటూ వారి భవిష్యత్తును రక్షించుకోవాలని తెలియజేశారు.ఈ కార్య క్రమంలో బాలల రక్షణ అధికారి కె.ఎల్.మనోహర్ -జిల్లా బాలల సంరక్షణ విభాగం, క్షేత్ర స్థాయి సామాజిక కార్యకర్త కె.ఎల్.వి.రమ్య, ఎం ఎల్ హెచ్ పి – పి సూర్య కుమారి , ఏఎన్ఎం – సంతోషి కుమారి, పలువురు వివోలు అంగనవాడి కార్యకర్తలు పాల్గొన్నారు..

