మునగపాకలో ప్రత్యేక వాహన తనిఖీలు మునగపాక ఎస్ ఐ పి ప్రసాద్ రావు…

మునగపాక :- మునగపాక రోడ్డులో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది.ఈ తనిఖీలలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారిపై,సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారిపై,అలాగే మైనర్లచే వాహనాలు నడపబడిన ఘటనలపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది.వాహనదారులు తమ భద్రత కోసం ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాలలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని పోలీసు శాఖ తరఫున విజ్ఞప్తి చేయడమైనది.ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సహకరించాలని కోరుతున్నాము.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment