
గజపతినగరం :- ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఉన్న పురిటిపెంట గ్రామ సచివాలయ ఆవరణలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ,కస్టర్ ఇంచార్జ్ వి వి ప్రదీప్ కుమార్,ఈవో జగదీష్ తో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి,కాలుష్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా మొక్కల పెంపకం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు.కేవలం మొక్కలు నాటడమే కాకుండా,వాటిని సంరక్షించడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

