
గాజువాక :- అనపర్తి బిజేపి శాసనసభ్యులు మరియు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రాష్ట్ర కన్వీనర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అనపర్తి రామవరం ఆయన క్యాంపు కార్యాలయంలో బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ బిఎల్ఏ వన్ కరణంరెడ్డి నరసింగరావు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు జరుగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కి సంబంధించి పలు విషయాలు రాష్ట్ర సర్ కన్వీనర్ మరియు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళినట్లు తెలిపారు.గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో వున్న 309 పోలింగ్ బూత్ లకు బూత్ లెవల్ ఏజెంట్ 2 లను నియమించినట్లు తెలిపారు. ఆయన కేఎన్ఆర్ ని అభినందించారని తెలిపారు. సర్ పై తీసుకోవలసిన పలు కీలక జాగ్రత్తలను సూచించారని తెలిపారు. అనంతరం ఆయనను సాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.అనపర్తి శాసనసభ్యులు మరియు బిజేపి సర్ రాష్ట్ర కన్వీనర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆప్యాయంగా ఇచ్చిన ఆతిథ్యం ( మధ్యాహ్నం భోజనం) మరువలేనిదని అన్నారు.ఈ సందర్భంగా ఆయనకు కేఎన్ఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు..

