
పాయకరావుపేట :- కేశవరం గ్రామంలో ఉన్న డెక్కన్ ఫైన్ కెమికల్స్ సంస్థలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంస్థ ప్రాంగణంలో ఉద్యోగులు కలిసి 1,000 మొక్కలను నాటారు.అలాగే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్లాంట్ హెడ్ శ్రీ కె.వి.ఎల్.పి.రాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.వృక్షారోపణ,నీటి సంరక్షణ,ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి చర్యల ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు.ప్రతి ఉద్యోగి ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఆనందరావు,ఎ.ఎన్.వీరారెడ్డి,పి.వి.ఎస్.ఎస్.రాజు,ఎన్.కృష్ణమూర్తి,ఎస్.వి.రాజు మరియు గౌరీశంకర్ పాల్గొన్నారు.వీరితో పాటు సంస్థ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేశారు.

