
గంట్యాడ :- రైతులకు ఒకసారిఇచ్చిన యూరియా కార్డు పోగొట్టుకుంటే మళ్లీ ఇవ్వడం జరగదని,మంగళవారం గంట్యాడ మండలం లక్కిడాం,సిరిపురం గ్రామాలలో యూరియా పై నిర్వహించిన అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ వీటి రామారావు అన్నారు. యూరియా కార్డులపై గంట్యాడ మండల వ్యవసాయ అధికారి బి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ జిల్లా జెడి వీటి రామారావు ముఖ్య అతిథిగాపాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులకు యూరియా కార్డులు, నవధాన్యాల కిట్లు ను వ్యవసాయశాఖ జిల్లా జేడీ వీటి రామారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ,యూరియా కార్డుల ద్వారా రైతులకు యూరియా, డి ఏ పి ఎరువులు అందజేయడం జరుగుతుందన్నారు.వ్యవసాయ పంటలను అనుసరించి సిఫార్సు చేసిన ఎరువులు యూరియా కార్డుల ద్వారా రైతులకు అందజేస్తామన్నారు. విత్తన శుద్ధి వలన చేకూర్ ప్రయోజనాలు,నవధాన్యాలు సాగువలన లాభాలు తదితర విషయాల గురించి అవగాహన కల్పించారు.కార్యక్రమంలోగంట్యాడ మండల వ్యవసాయ అధికారి బి శ్యామ్ కుమార్, ఏఈఓ సునీల్ కుమార్, విఏఏలు గ్రామ పెద్దలు రైతులు తదితరులు పాల్గొన్నారు…

