1900 కోళ్లు మృతి..

వీరఘట్టం :- ఎండ తీవ్రత,విద్యుత్ కోతలతో వీరఘట్టం మండలం అచ్చపువలస గ్రామ సమీపంలో ఉన్న కోళ్లు ఫారంలో 1900 కోళ్లు మృతి.ఆ లైన్ లో విద్యుత్ పనులు చేపట్టేందుకు సోమవారం ఉదయం నుంచి 8 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసిన విద్యత్ శాఖ అదికారులు.కోళ్లుకు నీళ్ళు పెట్టేందుకు, ఫ్యాన్స్ వేసేందుకు కరెంట్ లేకపోవడంతో ఎండ తీవ్రతకు కోళ్లన్నీ వందల సంఖ్యలో మృతి చెందాయి.విద్యుత్ పనులు చేపట్టేటప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం పై కోళ్లు ఫారం యజమాని మర్రి సురేష్ ట్రాన్స్ కో సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కోళ్లు మృతితో తనకు సుమారు రూ.2.50 లక్షలు నష్టం జరిగిందని లబోదిబోమంటున్న యజమాని.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment