డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అస్తవ్యస్తం.. ఎం ఎల్ సి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి…

నెల్లూరు :- నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డివిజన్ ఇంచార్జ్ లు,కార్పొరేటర్లు,వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ను కలిసి డివిజన్ల డిలిమిటేషన్ ప్రక్రియలో తలెత్తుతున్న అభ్యంతరాలను..కమిషనర్ కి రాతపూర్వకంగా అందజేశారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని డీలిమిటేషన్ ప్రక్రియలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేయాలని కమీషనర్ ను కోరారు.నెల్లూరు నగర నియోజకవర్గంలో డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియను నగరపాలక సంస్థ అస్తవ్యస్తంగా జరిపిందని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు.వైస్సార్సీపీ సూచించిన విధంగా డివిజన్ సరిహద్దులను మార్పు చేయక పోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment