ఎన్‌సీసీ విద్యార్థినులకు విస్తృత అవగాహన కార్యక్రమం…

పోక్సో చట్టం,మహిళల హక్కులు,లీగల్ లిటరసీపై ప్రత్యేక అవగాహన.
మహిళలపై నేరాలు,సైబర్ క్రైమ్‌లు,బాల్య వివాహాల నివారణపై విద్యార్థినులకు సూచనలు.
లక్ష్యసాధనతో చదువులు,ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలపై విద్యార్థినులకు ప్రేరణ.

తిరుపతి :- తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్.,గారి ఆదేశాల మేరకు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ శ్రీమతి శ్రీలత గారి ఆధ్వర్యంలో సీఐ శ్రీ తమిమ్ అహ్మద్ వారు,IV అదనపు ఏజేసీజే కోర్టు తిరుపతి ఏపీపీ శ్రీమతి సుజాత గారు మరియు శక్తి టీమ్ సభ్యులతో కలిసి తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న 5 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఎన్‌సీసీ శిబిరంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 600 మంది విద్యార్థినులకు పోక్సో చట్టం,మహిళల హక్కులు,లీగల్ లిటరసీ అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, చైల్డ్ పోర్నోగ్రఫీ, బాల్య వివాహాలు,సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని,అనుమానాస్పద ఘటనలు ఎదురైన వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.అదేవిధంగా విద్యార్థినులు స్పష్టమైన లక్ష్యంతో చదువులు కొనసాగించి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రోత్సహించారు. ప్రభుత్వ ఉద్యోగాల ప్రాధాన్యత, ప్రస్తుతం మరియు భవిష్యత్తులో అందుబాటులో ఉన్న వివిధ ఉపాధి అవకాశాల గురించి వివరించి, క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం మరియు చట్టాలపై అవగాహన ప్రతి మహిళకు రక్షణ కవచంగా నిలుస్తాయని తెలియజేశారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment