
తిరుపతి :- డక్కిలి మండలం సంగనపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఏపీఐఐసీఈ (AP IIC) పార్కు శంకుస్థాపన కార్యక్రమం సోమవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సలిజాముల వెంకటేశ్వర్ గారు హాజరుకానున్నట్లు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం తహసిల్దార్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంగనపల్లి గ్రామ సమీపంలో పార్కు నిర్మాణం కోసం 15 ఎకరాల భూమిని కేటాయించినట్లు వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా 38 ఏపీఐఐసీఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి సోమవారం వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు.అదే సమయంలో సంగనపల్లిలో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పార్కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు.కార్యక్రమం విజయవంతం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తహసీల్దార్ తెలిపారు.ఈ పార్కు ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు…

