లారీ వెనుక మరో లారీ డీ…డ్రైవర్ కు గాయాలు.ప్రమాదాల అడ్డగా కొండూరు సత్రం హైవే…

నెల్లూరు /మనుబోలు :- మనుబోలుకు ఉత్తరంగా జట్ల కొండూరు సత్రం రోడ్డు ప్రమాదాలకు అడ్డగా మారింది. ప్రతినిత్యం ఇక్కడ 16వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయి.తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదంలో జట్ల కొంండూరు సత్రం వద్ద అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.చెన్నై కలకత్తా 16 నెంబర్ జాతీయ రహదారి కొండూరు సత్రం ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలకు నిలయమైంది.ఈ ప్రయత్నంలో ఆదివారం ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న లారీ ఢీకొంది. దీనికి సంబంధించిన పూర్వపరాలి ఈ విధంగా ఉన్నాయి.నెల్లూరు నుంచి చెన్నై వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న లారీని వెనకనుంచి ఢీకొనడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.. ఈ సంఘటన మనుబోలు మండలం కొండూరు సత్రం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.కృష్ణపట్నం పోర్ట్ నుంచి ముందు వెళ్తున్న లారీ సడన్ గా ఆగడంతో అదే మార్గంలో నెల్లూరు నుంచి వెనక వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. దీనితో లారీ ముందు బాగా నుజ్జు నుజ్జుగా మారింది.డ్రైవర్ కు తీవ్ర గాయాలైనవి.చికిత్స నిమిత్తం గూడూరు తరలించారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేసి కేసు నమోదు చేశారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment