
గుంటూరు :- నగర కమిషనర్ మయూర్ అశోక్ పై మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్, తెలుగు విద్యార్థి విభాగ ఉపాధ్యక్షులు రాయపాటి అమృత రావు దౌర్జన్యానికి దిగారు.సోమవారం రాత్రి తన అనుచరులతో కలిసి కార్పొరేషన్ వెళ్లిన ఆయన తోలుత ఇంజనీరింగ్ విభాగంలో హల్ చల్ చేశారు .తన కాంట్రాక్టును ఎందుకు రద్దు చేశారంటూ ఇంజనీరింగ్ విభాగ అధికారులు ,ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. అలాగే ద్వారాలఅద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కమిషనర్ అశోక్ చాంబర్లోకి దూసుకు వెళ్ళారు. సిబ్బంది వారిస్తున్న వినకుండా కమిషనర్ పై కేకలు వేస్తూ దౌర్జన్యానికి దిగారు .అనంతరం సిబ్బంది ,పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేత బయటికి పంపేందుకు ప్రయత్నింప చేశారు. పోలీసుల మాట సైతం అమృత రావు వినకుండా ,దౌర్జన్యం కొనసాగించారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ మేనేజర్ ,లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ పై ,కాంట్రాక్టర్ అమృతరావ్ వర్గీయులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఉద్యోగ వర్గాలన్నీ కాంట్రాక్టర్ పై తీవ్ర అగ్రహ వేశాలకు గురయ్యారు.గతంలో సూపర్డెంట్ ఇంజనీర్ పైన కూడా ఇదేవిధంగా దౌర్జన్యానికి అమృత రావు పాల్పడ్డారనిగుర్తు చేశారు .తాజాగా సాక్షాత్తు నగర కమిషనర్ పైనే దౌర్జన్యానికి,దాడికి బరితెగించడం సహించరాని విషయం అన్నారు.దాడిని మున్సిపల్ కార్పొరేషన్ మినీస్టీరియల్ స్టాప్ ఖండించింది.నగర కమిషనర్ పై దాడికి పాల్పడిన కాంట్రాక్టర్ను కఠినంగా శిక్షించాలని నగర సిపిఐ కార్యదర్శి అరుణ్ కుమార్ మంగళవారం కొత్తపేట మల్లయ్య లింగం భవన్ లో పార్టీ నాయకులతో కలిసి డిమాండ్ చేశారు.సాక్షాత్తు ఐఏఎస్ అధికారిపై దాడి ,ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం అన్నారు.ఛాంబర్ లోకి వెళ్లి కాంట్రాక్టర్ దౌడీ చేయడం దుర్మార్గమన్నారు .దాడికి పాల్పడిన దోషిని ,ఆయన వర్గీయులను కఠినంగా శిక్షించాలని అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా నగర కమిషనర్ ఛాంబర్ లో ,మున్సిపల్ కార్పొరేషన్ లోఎటువంటి దాడికి దౌర్జన్యానికి పాల్పడలేదని కాంట్రాక్టర్ రాయపాటి అమృత రావు వివరణ ఇచ్చారు.

