
నాదెండ్ల :- నాదెండ్ల,మండలంలోని సాతులూరు గ్రామంలో ఈనెల 24వ తేదీ నుండి నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ నాలుగవ జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలలో బుధవారం గంధం నాగరాజు కళా ప్రాంగణంలో రాత్రి 7:30 నుండి నాటిక పోటీలు ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. స్వర్ణ సూర్య గ్రామ లవర్స్ హైదరాబాదు వారిచే స్త్రీ మాత్రమే నమ, రెండో ప్రదర్శన హర్ష క్రియేషన్స్ విజయవాడ వారిచే చెరిగిపోని చిరునామా , మూడవ ప్రదర్శన శ్రీ కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ గుంటూరు వారి తరమెళ్లి పోతున్నదో, నాటికలతో పాటు ప్రత్తిపాటి భార్గవి బృందం చే నృత్య ప్రదర్శన నిర్వహించనున్నట్లు సుమధుర గీతాలు గొట్టిపాటి రామారావు ఓఎన్నార్ బృందం జ్యోతి ప్రజ్వాలం మాజీ సర్పంచి గొట్టిపాటి వెంకటరమణ సభా పరిచయం నడింపల్లి వెంకటేశ్వరరావు, సభ అధ్యక్షులు బండారుపల్లి రామారావు ముఖ్య అతిథులు నాటక అకాడమీ డైరెక్టర్ బండారుపల్లి విశ్వేశ్వరరావు, విశిష్ట అతిథులు సినీనటి మౌనిక చౌదరి నరసరావుపేట వివేకానంద వైద్యశాల డాక్టర్ శాఖమూరి బాజీ, శ్రీకృష్ణ చైతన్య జూనియర్ కాలేజీ డైరెక్టర్ కొల్లి బ్రహ్మయ్య తదితరులు పాల్గొంటారని వెంకటేశ్వర తెలిపారు.

