ఉమ్మడి విశాఖ జిల్లా 39 మండల ప్రజా పరిషత్ పరిపాలనాధికారులతో సమావేశం..జిల్లా జెడ్.పి సి.ఈ.ఓ ప్రత్యేక సమీక్ష…

విశాఖసిటీ.. ఉమ్మడి విశాఖ జిల్లా 39 మండల ప్రజా పరిషత్ పరిపాలనాధికారులతో జిల్లా జెడ్.పి సి.ఈ.ఓ ప్రత్యేక సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. మంగళవారం ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు విశాఖపట్నం జిల్లా ప్రజా పరిషత్ (జెడ్.పి) సమావేశ మందిరంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన 39 మండల ప్రజా పరిషత్ పరిపాలనాధికారులతో ప్రత్యేక సమీక్షా.సమావేశానికి విశాఖపట్నం జిల్లా ప్రజా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సి.ఈ.ఓ) పి. నారాయణమూర్తి, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డిప్యూటీ సి.ఈ.ఓ) కె. రాజ్ కుమార్ అధ్యక్షత వహించి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రధాన అంశాలు సమీక్ష జరిగింది.ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని 39 మండల ప్రజా పరిషత్ల దైనందిన పరిపాలనా వ్యవహారాలు, స్వచ్ఛ రథం, ఓడిఎఫ్ ప్లస్ పథకాల అమలుపై అధికారులతో కూలంకషంగా చర్చ జరిగింది.ప్రభుత్వ పథకాల అమలు తీరు, రికార్డుల నిర్వహణ, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష చర్చించారు.పరిపాలనా పరమైన సమస్యల పరిష్కారం, పనుల్లో వేగం పెంచడం, పారదర్శకత పాటించడం పట్ల పరిపాలనాధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment