
డ్రైవర్ పరిస్థితి విషమం.మరో ముగ్గురికి గాయాలు…
గోకవరం :- కొత్తపల్లి గ్రామ శివారు జరిగిన కారు ప్రమాదంలో సంవత్సరం బాబు తో పాటు మరో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడిన సంఘటన మంగళవారం గోకవరం మండలంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగ్గంపేట ట్రావెల్స్ సంబంధించిన ఇనోవా వెహికల్ ను సెల్ఫ్ సర్వీస్ కి జగ్గంపేట మండలం మలిశాల గ్రామానికి చెందిన కందిగట్ల నాని అద్దెకి తీసుకుని రంపచోడవరం వెళ్లి తిరిగి మళ్లీ మల్లిసాల వెళ్తుండగా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామ శివారు కు వెళ్లేసరికి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టి ఆ పక్కనే ఉన్న జీడిపిక్కల ఫ్యాక్టరీ ప్రహరీ గోడని ఢీకొని వెళ్లి విద్యుత్ ట్రాన్స్ఫార్మ్ ఢీ కొట్టి నా సంఘటనలో కారులో ఉన్న మల్లిశాల గ్రామానికి చెందిన కంది గట్ల లక్కి సంవత్సరం బాబు తో పాటు కొండిపూడి వివేక్ (19), బల్లిలా పద్మ (19) సంఘటన స్థలంలోనే మృతి చెందారన్నారు. కారు డ్రైవర్ నాని, అతని భార్య, కుమార్తె, పక్కింటి బాలుడు రమణ కుమార్ గాయాలతో ఉన్నారు. డ్రైవర్ భార్యకు చేయి విరిగిపోయిందని, డ్రైవర్ నాని పరిస్థితి విషమంగా ఉందన్నారు.కుమార్తె, పక్కింటి బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారన్నారు. విషయం తెలుసుకున్న గోకవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు…

