పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో తుమ్మలపల్లి రమేష్ సేవా కార్యక్రమాలు…

డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నం వడ్డించడం ఆనందంగా ఉంది – తుమ్మలపల్లి రమేష్

జగ్గంపేట :- జగ్గంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్ జనసేన నాయకులతో కలిసి పాల్గొని పేదలకు స్వయంగా అన్నం వడ్డించారు.ఈ జనసేన నాయకులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తుమ్మలపల్లి రమేష్ తన సొంత ఖర్చులతో ప్రతి మంగళవారం నిరంతరం ఈ క్యాంటీన్ నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని కొనియాడారు.ఈ రోజు నిర్వహించిన డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, రామవరం ఎంపీటీసీ దొడ్డా శ్రీను, గంధం శ్రీను, గాది నాగరాజు,అంకం ఓం కృష్ణ, కాయల మణికంఠ, పాలెం బాబీ, తుంగపల్లి గోవింద్, గుంటముక్కల చిన్న,గోకేడ పండు,కొయ్యన ఉమా మహేశ్వర రావు జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment