
హైదరాబాద్ :- తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహాయసహకారాలు అందిస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.తమిళనాడు మంత్రి పి.విశ్వనాథన్ను మంత్రి పొంగులేటి ఘనంగా సన్మానించారు.తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పి.విశ్వనాథన్ ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార.. పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి మంత్రి పొంగులేటిని సత్కరించారు.అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వేలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి తమిళనాడు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న పి. విశ్వనాథన్ను శాలువా, పూల మొక్కతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… తమిళనాడులో దాదాపు 59 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత ప్రజాసేవ చేయాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశ్వనాథన్ కృషి చేయాలని ఆకాంక్షించారు.

