
నెల్లూరు /సైదాపురం :- మండల కేంద్రంలోని తూర్పు పూండ్ల క్రాస్ రోడ్డు వద్ద ఎస్ఐ .దుర్గాప్రసాద్ వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,కారు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



