కోనసీమలో నిప్పుల కొలిమి…

అమలాపురం :- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఆదివారం నిప్పులు కొలిమిగా తయారైంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎండ వేడితో జనాలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సుమారు 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మాణాస్యంగా మారాయి. ఉదయం నుండి ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు. భానుడు భగభగలతో మూగజీవాలు పశుపక్షాదులు ఎండవేడిని తట్టుకోలేక గిలగలలాడాయి. ఇదే ఉష్ణోగ్రతలు మరో వారం రోజులు పాటు ఉంటాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత అధిక వేడిలో బయట తిరిగితే కచ్చితంగా వాడగాల్పులకు గురై ప్రణాపాయస్థితిలు ఏర్పడతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు గర్భిణీలు బాలింతలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ అధికంగా మంచినీరు త్రాగాలని అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళవలసి వస్తే కూడా వాటర్ బాటిల్ లేదా మజ్జిగతోపాటు తలకు టోపి,రుమాలు,కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలని వైద్యులు చూసిస్తున్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment