
ప్రజలకు అందుబాటులో అధికారులు..కలెక్టర్ కీర్తి చేకూరి…
రాజమహేంద్రవరం :- ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్),భూసంబంధిత ఫిర్యాదుల పరిష్కార వేదిక (రెవెన్యూ క్లినిక్) కార్యక్రమాలు నేడు (సోమవారం) జిల్లా వ్యాప్తంగా యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుంచి జిల్లా స్థాయి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటారని తెలిపారు.అలాగే డివిజన్ స్థాయిలో డివిజనల్ పరిపాలన అధికారులు,మండల స్థాయిలో తహశీల్దార్లు,సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండి ప్రజల వినతులను స్వీకరిస్తారని తెలిపారు.ప్రజలు తమకు సమీపంలోని కార్యాలయాల్లో నేరుగా అర్జీలు సమర్పించవచ్చని సూచించారు.అదే విధంగా,ప్రజలు ‘మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం 95523 00009 నెంబరుకు ఫిర్యాదులు పంపి పౌర సేవలు పొందవచ్చని వెల్లడించారు. పీజీఆర్ఎస్‌కు సంబంధించిన సమాచారం,ఫిర్యాదుల వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు.

