జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2026 ముందస్తు సన్నాహక చర్యలను వేగవంతం చేయాలి..జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి :- జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2026 ముందస్తు సన్నాహక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లాలలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–2026) కార్యక్రమానికి సంబంధించి చేపడుతున్న సన్నాహక చర్యలపై మంగళవారం సాయంత్రం విజయవాడ నుండి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్లు,జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.ఎన్నికల నమోదు అధికారులు (EROs),సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROs),బూత్ లెవల్ అధికారులు (BLOs) నియామకం,శిక్షణ కార్యక్రమాలు, రాజకీయ పార్టీలతో సమావేశాలు, ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణ మరియు పంపిణీ, BLO కిట్ల అందజేత, BLO లకు గౌరవ వేతనాల చెల్లింపు తదితర అంశాలపై చర్చించారు.అలాగే వాలంటీర్ల నియామకం,హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు,పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ తదితర అంశాలపై జిల్లాల వారీగా పురోగతిని సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు.వీసి అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ…ప్రత్యేక సవరణ ప్రక్రియను సమయపాలనతో పూర్తి చేసి,అర్హులైన ప్రతి ఓటరిని జాబితాలో నమోదు చేయాలని సూచించారు.జిల్లా స్థాయిలో అన్ని ఏర్పాట్లు సమన్వయంతో చేపట్టి, ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్,నియోజకవర్గ ఈఆర్వోలు, సంబంధిత రెవెన్యూ మరియు ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment