
నరసరావుపేట :- పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లో ఎస్పీ ని వినుకొండ మండలం దొండపాడు గ్రామానికి చెందిన పిడతల బ్రహ్మేశ్వరి తన భర్త ప్రతిరోజు మధ్యం తాగి అదనపు కట్నం కోసం అత్త చెన్నమ్మ మామ శ్రీను ఆడబిడ్డ విజయలక్ష్మి లతోపాటు మరిది గణేష్ లు వేధిస్తూ తన భర్త మహేశ్వరి అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడని దానికి సంబంధించిన అన్ని పెళ్లి ఫోటోలు ఎస్సై గారికి ఇవ్వడం జరిగింది తన నుండి విడాకులు కావాలని ప్రతిరోజు కొడుతూ ఇంటి నుండి గెంటివేస్తే తన గ్రామం వెళ్ళిన బ్రహ్మేశ్వరి ఇంటి పైకి అర్ధరాత్రి మద్యం తాగి వచ్చి తన తండ్రి గాలయ్య ను కాలు విరిగే దాకా కొట్టి చెల్లెలు కోటేశ్వరి పై పాశవికంగా దాడి చేశాడని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్సీ ఐ అదనపు చికిత్స కోసం నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకుని వారం రోజులు ఉన్నప్పటికీ దానికి సంబంధించిన కేసు నమోదు చేయకపోగా రెండో వివాహం చేసుకొని భార్యా పిల్లల్ని ఇబ్బందులకు గురి చేస్తూ అతనికి మద్దతుగా అత్తా మామ మరిది ఆడబిడ్డలు వ్యవహరిస్తున్నారని వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై ఉదయలక్ష్మికి ఫిర్యాదు చేస్తే రెండు కేసులు పట్టించుకోకపోగా కనీసం ముద్దాయిలను పిలిపించి మాట్లాడే పరిస్థితి లేదని రాత్రి అనగా నిన్నటి రోజున వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై ఉదయలక్ష్మితో మాట్లాడితే నేను కేసు కట్టనని మీకు చేత అయిన వాళ్ళ దగ్గరికి వెళ్లి చేయించుకోమని దురుసుగా నిర్లక్ష్యంగా బాధితురాలు బ్రహ్మేశ్వరి కి సమాధానం చెప్పిందని జిల్లా ఎస్పీ ని కలిసి తనకు న్యాయం చేయమని కోరింది ఈ సందర్భంగా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడుతూ వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో గతంలో ఇరువురి మధ్య అక్రమ సంబంధాలు ఉంటే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్యగా కేసు నమోదు చేసిన ఎస్ఐ ఉదయలక్ష్మి భార్య ఉండగానే మరో మహిళను పెళ్లి చేసుకున్న భర్తపై ఎటువంటి కేసు నమోదు చేయకుండా కాలయాపన చేయటం వెనక ముద్దాయిలకు కొమ్ముకాస్తుందని ఎమ్మెల్సీ అయిన కేసును కూడా 15 రోజులు పాటు నమోదు చేయలేదంటే ఆ పోలీస్ స్టేషన్లో బాధితుల పక్షాన ఏ స్థాయి నిర్లక్ష్యం నడుస్తుందో జిల్లా అధికారులు గమనించాలని బ్రహ్మేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకపోతే ఐజీ దృష్టికి వెళతామని డా గోదా జాన్ పాల్ మాట్లాడారు ఎస్పీ ని కలిసిన వారిలో బాధితురాలు బ్రహ్మేశ్వరి తో పాటు ఆమె తల్లి జల్ది సుజాత,వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షుడు రాయిని చిన్న, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కొమ్మతోటి సుధాకర్,జొన్నలగడ్డ సామేలు సలోమి తదితరులు పాల్గొన్నారు.


