దేశంలోని మొట్టమొదటి ఆలయాన్ని దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జ్ …

ఏర్పేడు :- ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో వెలసిన ప్రాచీన శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరుశురామేశ్వర స్వామి దేవాలయంను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జయసూర్య మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దేవాలయానికి చేరుకున్న అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా,జడ్జి కుటుంబ సభ్యులు స్వామి అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. దర్శనం అనంతరం వేద పండితులు జడ్జి కుటుంబానికి ఆశీర్వచనం చేశారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామి,అమ్మవార్ల శేషవస్త్రాలతో పాటు తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. దేవాలయ చారిత్రక విశిష్టత, పురాతనత గురించి ఆలయ అర్చకులు వివరించారు. గుడిమల్లం దేవాలయం దేశంలోనే అత్యంత పురాతన శైవక్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి,ఆలయ ఈవో,అర్చకులు,సిబ్బంది పాల్గొన్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment