పబ్లిక్ కొళాయిలు కొనసాగించాలి : సిపిఎం…

శ్రీకాళహస్తి :- శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో పేదల మంచినీటి అవసరాలు తీరుస్తున్న పబ్లిక్ కొళాయిలను కొనసాగించాలని సీపీఎం శ్రీకాళహస్తి ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. పేదల పట్ల మున్సిపల్ కమిషనర్ తీరు ఆక్షేపనీయమన్నారు.మొన్న పన్నుల వసూళ్ల పేరిట పేదల నివాస ప్రాంతాలకు మంచినీటి సరఫరాను నిలేపేసిన కమిషనర్,తాజాగా వృధా పేరిట పబ్లిక్ కొళాయిలను తొలగించడం సహేతుకం కాదన్నారు.పట్టణంలో 20 శాతం ప్రజలు పబ్లిక్ కొళాయిల ద్వారా తమ నిత్యావసరాలు తీర్చుకుంటున్నారని గుర్తు చేశారు. తక్షణమే పబ్లిక్ కొళాయిలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.నాయకులు అంగేరి పుల్లయ్య,పెనగడం గురవయ్య,గురునాధం,రమణయ్య,ఈశ్వరయ్య,కుమార్,రాజా,రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment