ఘర్షణలో ఇరువర్గాలపై కేసు నమోదు.సీఐ పి వీరాంజనేయులు…కొల్లూరు..

కొల్లూరు :- కొల్లూరు పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘర్షణలో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు వేమూరు సీఐ వీరాంజనేయులు తెలిపారు. సోమవారం సిఐ మాట్లాడుతూ ఘర్షణలో ఒక వర్గానికి చెందిన కొండూరు రవీంద్ర ఆలియాస్ డానియల్, కొండూరు అశోక్, గొడవర్తి తేజ,దున్న చింతయ్య,చొప్పర చింతయ్య,చొప్పర మధుబాబు, కొమ్మూరి రవీంద్రబాబు ఆలియాస్ రవీంద్ర,చొప్పర వంశీ,కనపాల బాబురావు, పాలపర్తి కిరణ్ కుమార్ అనే పదిమంది పై, రెండో వర్గానికి చెందిన ఉప్పు జానకి రామయ్య, రాము బాల శివ గంగాధర్ అలియాస్ బాలు,రాము శివన్నారాయణ,రాము వెంకటలక్ష్మి, మిరియాల జయ రావు, సోమరౌతు హరికృష్ణ సుందర లక్ష్మీనారాయణ అలియాస్ హరి, ఈమని సుధాకర్, కొక్కిలిగడ్డ అఖిల్, సనకా శివ నాగ గోపయ్య అలియాస్ శివయ్య , సనకా జై నరేష్ అలియాస్ ,నరేష్, రాము బాను సీతారాం అలియాస్ భాను అనే 11 మంది పైన కేసు నమోదు చేశారన్నారు. వీరిని కోర్టుకు హాజరుపరచునున్నట్లు తెలిపారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిఐ తెలిపారు. డిఎస్పి ఆవుల శ్రీనివాసరావు పర్యవేక్షణలో కేసు నమోదు చేసి కోర్టుకు హాజరపరచినట్లు సీఐ తెలిపారు.

దళితుల అక్రమ అరెస్టుల పై రాస్తారోకో.రోడ్డు పై బైటాయించిన మహిళలు…

పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని దళితవాడలో రోడ్ల పై బైఠాయించారు. సోమవారం కొల్లూరు దళితవాడలో ప్రధాన రహదారిపై మహిళలు బైఠాయించి తమ పిల్లలను ఎందుకు అరెస్టు చేశారు తమకు తెలియకుండా చేశారని వాపోయారు. మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో రెండు వైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న వేమూరు సీఐ పీ వీరాంజనేయులు కొల్లూరు ఎస్సై కోటేశ్వరరావు హుటా హుటిన రాస్తారోకో దగ్గరకు చేరుకుని రోడ్డుపై బైఠాయించిన వారందరినీ లెగవమనడంతో వారు లెగవ పోయేసరికి పోలీసులకు మహిళలకు వాగ్వాదం పెరిగింది. సీఐ వీరాంజనేయులు వీడియోల ఆధారంగా అరెస్టు చేశామని వీడియోలు చూపించిన తర్వాత వారు అర్థం చేసుకుని రోడ్డుపై నుంచి పక్కకు వెళ్లిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం తీరింది.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment