మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత…గజపతినగరంలో బొబ్బిలి డిఎస్పి ఆర్ గోవిందరావు…

గజపతినగరం :- మహిళల భద్రతకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యతనిచ్చి ఆ దిశగా పనిచేస్తున్నదని,శుక్రవారం గజపతినగరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో బొబ్బిలి డిఎస్పి ఆర్ గోవిందరావు అన్నారు. జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు గజపతినగరం, పురిటిపెంట గ్రామాలలో మహిళలకు, ఉపాధి హామీ మహిళా వేతనదారులకు పలు విషయాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బొబ్బిలి డిఎస్పి ఆర్ గోవిందరావు మాట్లాడుతూ,మహిళా చట్టాలు, ప్రస్తుత కాలంలో మహిళల పట్ల జరుగుతున్న హింస అరికట్టే విధంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, మహిళల కోసం చేపట్టబడిన చట్టాల కోసం, సైబర్ నేరాల కోసం అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రహదారి భద్రతా సూత్రాలు పాటించాలని బొబ్బిలి డిఎస్పి ఆర్ గోవిందరావు అన్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.సన్యాసి నాయుడు,గజపతినగరం ఎస్ ఐ కె .కిరణ్ కుమార్ నాయుడు పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు…

 

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment