పీజీఆర్‌ఎస్ పూర్తయ్యేంతవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు జిల్లా కలెక్టర్ నిషాంతి.టి…

పాడేరు రూరల్ :- సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో 62 వినతులు,రెవెన్యూ క్లినిక్‌లో 41 వినతులు అందాయి.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిషాంతి.టి, జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీ పూజ, ఐటిడిఏ పీవో ఆదిత్య వర్మ,డీఆర్వో (ఎఫ్‌ఏసీ) ఎంవీఎస్ లోకేశ్వరరావుతో కలిసి వివిధ మండలాలు,గ్రామాల నుండి వచ్చిన అర్జీదారుల వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ఫిర్యాదులు ఎంత గడువులో పరిష్కారం అవుతాయో అర్జీదారులకు ముందుగానే తెలియజేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి.

ప్రతి శుక్రవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా పూర్తి సమాచారంతో హాజరు కావాలని, కార్యక్రమం పూర్తయ్యేంతవరకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పీజీఆర్‌ఎస్‌లో ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొనాలని, అర్జీల స్వీకరణ మరియు నమోదు కోసం కౌంటర్ల వద్ద కింది స్థాయి శాఖ సిబ్బంది ఉండాలని సూచించారు.మండల స్థాయిలోనే సమస్యల పరిష్కారం.ప్రతి సోమవారం మండల స్థాయిలో ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజా పరిష్కార వేదిక నిర్వహించాలని,మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో ప్రతిరోజూ ప్రజల ఫిర్యాదులు స్వీకరించి తక్షణ పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కరిస్తే జిల్లా స్థాయికి వచ్చే ఫిర్యాదులు తగ్గుతాయని, అర్జీదారులకు త్వరగా న్యాయం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఐవీఆర్ఎస్ వ్యవస్థలో పురోగతి కోసం అధికారులు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహనతో స్పందించాలని సూచించారు.భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి ప్రత్యేకంగా భూ సంబంధిత ఫిర్యాదులపై అధికారులు శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుదారుల భూ రికార్డులను పూర్తిగా పరిశీలించి ప్రభుత్వ రికార్డులతో సరిపోల్చి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సమస్య ఎందుకు పరిష్కారం కాలేదో స్పష్టంగా వివరించాలని తెలిపారు…

1100 కాల్ సెంటర్ సేవలు వినియోగించాలి,అర్జీదారులు “మీ కోసం” 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని,ఫిర్యాదుల స్థితిగతులు తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు.అలాగే Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలు ఈ రోజు స్వీకరించిన అర్జీలు డీఆర్‌డీఏ,ఐసీడీఎస్,బ్యాంకులు,రెవెన్యూ,విద్యుత్,పౌర సరఫరాలు,ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్,పంచాయతీరాజ్,పీఆర్ ఇంజనీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌ఓఎఫ్‌ఆర్, పెన్షన్లు, రోడ్లు-భవనాలు, వైద్యశాఖలకు సంబంధించినవి.వివిధ గ్రామాల్లో రహదారులు,తాగునీరు,విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని అర్జీలు సమర్పించారు.మెడికల్ క్యాంప్ పరిశీలన.పీజీఆర్‌ఎస్ అనంతరం ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ సందర్శించారు. అర్జీదారులు క్యాంపులో పాల్గొన్నారా,ఎంతమంది పాల్గొన్నారు,అందరికీ సరిపడా మందులు అందించారా అనే వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పీడీ డీఆర్‌డీఏ వి.మురళి, పీడీ డ్వామా డి.విద్యాసాగర్, జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీబీకే పరిమళ, పీడీ ఐసీడీఎస్ ఝాన్సీబాయి పడల్,గురుకులం ఓఎస్డీ మూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కృష్ణమూర్తి నాయక్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నంద్, ఐటిడిఏ పరిపాలన అధికారి హేమలత,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.వెంకటరావు,ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నాగేశ్వరరావు,ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ సోమునాయుడు,డీపీవో చంద్రశేఖర్‌రావు,డీఎల్‌పీవో పి.ఎస్ కుమార్,జిల్లా మలేరియా అధికారి,ట్రైబల్ వెల్ఫేర్,ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు,లీడ్ బ్యాంక్ మేనేజర్ మాతునాయుడు తదితరులు పాల్గొన్నారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment