
గోదావరి స్నాన ఘాట్ల వద్ద మాక్ డ్రిల్..
రాజమహేంద్రవరం :- గోదావరి పుష్కర ఘాట్ల వద్ద ఒక్కసారిగా పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో ఆయా ఘాట్ల వద్ద ఉన్న భక్తులు తదితర జనం కలవరపాటుకు గురయ్యారు.తీరా అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.విషయానికొస్తే..తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు రానున్న పుష్కరాలు – 2027 నిమిత్తం మాక్ డ్రిల్ నిర్వహించారు.పుష్కర్ ఘాటులో ప్రతి 50 మీటర్ల పరిధిని బేసిక్ ఫంక్షనల్ యూనిట్ గా తీసుకుని 63 మంది సిబ్బందితో ఏ విధంగా ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్లు, రోప్ పార్టీలను ఏ విధంగా వాడాలి?, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ను ఏ విధంగా ఏర్పాటు చేయాలి,వాచ్ టవర్లను ఎన్ని ఏర్పాటు చేయాలి తదితర విషయాలను డ్రోన్ల ద్వారా మోనిటరింగ్ చేస్తూ మాక్ డ్రిల్ నిర్వహించారు.

సుమారు 63 మంది పోలీసు ఆఫీసర్లు,సిబ్బందితో కలసి ఏ విధముగా విధులు నిర్వర్తించాలి,ఘాటు వద్ద ప్రజలు ఏ విధంగా లోపలకి ప్రవేశించి,ఏ విధంగా బయటికి వెళ్లాలి,ఘాట్లోల ప్రజల సౌకర్యార్థం,వారి అవసరాల నిమిత్తం ఏమి ఉండాలి అనే వాటిపై..అలాగే ప్రజలను,అనుమానాస్పద వ్యక్తులను గమనించుటకు గాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం,డ్రోన్ కెమెరాతో ఘాటును పర్యవేక్షించడం వంటి వాటి గురించి,ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడిన యెడల ఎలా స్పందించాలి వంటి వాటి గురించి మాక్ డ్రిల్ ను పుష్కర్ ఘాట్ వద్ద నిర్వహించారు.ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహించే సమయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామకృష్ణ,ఏఆర్ డీఎస్పీ టీవీఆర్ కే కుమార్,సెంట్రల్ జోన్ డీఎస్పీ ఏ సుభాష్,ట్రాఫిక్ డీఎస్పీ వై శ్రీకాంత్,త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ వీ అప్పారావు,వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ,ప్రకాష్ నగర్ ఇన్‌స్పెక్టర్ బాజీ లాల్,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎండీ అబ్దుల్ నబీ ఇతర సిబ్బంది పాల్గొన్నారు…



