
రాజమహేంద్రవరం :- రూరల్ నియోజకవర్గం పరిధి కడియం ఏవిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ పరీక్షా ఫలితాలలో 500 మార్కులు పైబడి సాధించిన 20 మంది విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది,స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఆధ్వర్యంలో సత్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు వెలుగుబంటి రఘురాం (నాని) హాజరయ్యారు. వీ వాసంతి 563 మార్కులు సాధించి పాఠశాల ప్రథమ స్థానం సాధించగా, సీహెచ్ గౌతమి 557, జే వైశాలి 553 మార్కులతో ద్వితీయ,తృతీయ స్థానాలు సాధించారు.తేజాశ్వంత్ 550, సత్యపావని 547,ఎన్వీ సత్యసాయి 544,దీపిక 539,ఆదిత్య వర్ధన్ 530,మేఘన 527,రాజేశ్వరి 524,గణేష్ 520,నాగ శ్రీలక్ష్మి 518,శ్రీలక్ష్మి 517,షిరీన్ 505,శ్రీరామ్ 501 మార్కులు సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం టీ సత్యనారాయణ మాట్లాడుతూ 144 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 25 మంది పరీక్ష తప్పారని, వారికి అదనపు క్లాసులు నిర్వహించి రానున్న పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేటట్లుగా కృషి చేస్తామన్నారు.టీడీపీ నేత రఘురాం మాట్లాడుతూ వచ్చే సంవత్సరం నూరు శాతం ఫలితాలు సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉమాహేశ్వర దేవస్థానం చైర్మన్ పోరాటి శ్రీను,ఉపాధ్యాయులు రమేష్ బాబు,బీ సువర్ణవేణి,శరత్ బాబు,డేవిడ్,శ్రీనివాస్,రవికుమార్లు పాల్గొన్నారు.



