
నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు…
నర్సీపట్నం రూరల్ :- అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సృష్టి క్షేత్రం వద్ద వాచ్‌మెన్‌పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. బుధవారం ఇద్దరు వైసిపి నాయకులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.నర్సీపట్నం ఇంచార్జి డీఎస్పీ ఈ. శ్రీనివాసులు వివరాల ప్రకారం,పట్టణ వైసీపీ అధ్యక్షుడు ఏకాశివ, బలిఘట్టం వైసీపీ నేత సుర్ల నాయుడు లను పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు.ఈ కేసులో ఇద్దరిని నర్సీపట్నం కోర్టుకు హాజరుపరచగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ మరియు ఆయన పీఏ బాబు కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదిలా ఉండగా,కేసు నేపధ్యంలో నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు.మరోవైపు,మాజీ ఎమ్మెల్యే నివాసం వద్దకు వైసీపీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు….



