
99.33 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి వెల్లడి…
నెల్లిమర్ల :- భోగాపురం విమానాశ్రయం పనులను సమీక్షించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు,బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ తో పాటుగా పరిశీలించారు.కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.99.3% పనులను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రారంభానికి భోగాపురం విమానాశ్రయం సిద్ధమైంది అని వెల్లడించారు.విమానాశ్రయంలో అంతర్జాతీయ స్థాయి వసతులు,ప్రపంచంతో ఉత్తరాంధ్ర అనుసంధానం అయ్యేలా నిర్మాణం జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా ప్రారంభోత్సవం తరువాత అభివృద్ధి వైపు బలమైన అడుగులు వేస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు…



