తల్లిని హత్య చేసిన తనయుడు…రాజాంలో కలకలం…

రాజాం :- ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని డోలపేటలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ ఇంటికి పిలిపించి, తల్లినే హత్య చేసిన కుమారుడి ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.మే 4వ తేదీన ముంజేటి స్పందన అనే వివాహిత అనుమానాస్పదంగా హత్యకు గురైంది. అదే సమయంలో ఇంట్లోని బంగారం, నగదు కనిపించకపోవడంతో పోలీసులు మొదట దొంగతనం కోణంలో విచారణ ప్రారంభించారు.అయితే,ఘటన జరిగిన రోజే ఆమె పదవ తరగతి చదివే మైనర్ కుమారుడు కనిపించకపోవడం అనుమానాలకు దారితీసింది.పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టగా,బాలుడి ప్రవర్తనపై అనుమానాలు పెరిగాయి.గాలింపు చర్యలలో భాగంగా అతను మరో ఇంటర్ విద్యార్థితో కలిసి పలాస, ముంబై, విశాఖపట్నం,తిరుపతి ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సమాచారం లభించింది. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల వివరాల ప్రకారం: ఈ ఇద్దరు యువకులు క్రికెట్ గ్రౌండ్‌లో ఒక సంవత్సరంగా స్నేహం పెంచుకున్నారు,మైనర్ బాలుడి ప్రేమ వ్యవహారం బయటపడటంతో తల్లి మందలించడం,ఆంక్షలు విధించడం వల్ల కక్ష పెరిగింది,తల్లిని హతమార్చాలని ముందుగానే పథకం రచించారు విదేశీ వెబ్‌సైట్లలో చూసిన క్రైమ్ విధానాలను అనుకరించే ప్రయత్నం చేశారు.పథకం ప్రకారం తల్లి బాత్రూంలోకి వెళ్లే అలవాటు ఉందని తెలుసుకుని, ఇంటర్ విద్యార్థి ముందే అక్కడ దాక్కున్నాడు. మైనర్ బాలుడు టీవీ సౌండ్ పెంచి, తల్లిని ఇంటికి రప్పించాడు. ఆమె బాత్రూంలోకి వెళ్లగానే ఇద్దరూ కలిసి గొంతు పట్టి, నోరు మూసి దాడి చేశారు. ప్రతిఘటన చేసినప్పటికీ, చివరకు కత్తులతో పలు మార్లు పొడిచి హత్య చేశారు.తర్వాత మృతదేహాన్ని గుడ్డలో చుట్టి చెరువులో పడేశారు.బాత్రూం పూర్తిగా శుభ్రం చేశారు.ఎవరికి అనుమానం రాకుండా పారిపోయారు.ఈ ఘటనపై స్పందించిన చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు మాట్లాడుతూ, తమ పోలీస్ జీవితంలో ఇలాంటి దారుణ ఘటన చూడలేదని తెలిపారు.పోలీసుల సూచనలు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిత్యం పర్యవేక్షణ ఉండాలి.ముఖ్యంగా వారు సెల్‌ఫోన్‌లో చూసే కంటెంట్‌పై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.ఈ ఘటన సమాజంలో పెద్ద చర్చకు దారి తీస్తూ,యువతపై ప్రభావం చూపుతున్న అంశాలపై ఆలోచన అవసరాన్ని గుర్తు చేస్తోంది.ఆయన తోపాటు సి.ఐ అశోక్ కుమార్ పాల్గొన్నారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment