సకాలానికి చేరుకొని ప్రాణాన్ని కాపాడిన 108 సిబ్బంది…

పలాస :- పలాస మండలం సున్నాదేవి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు నుంచి జారి పడి తీవ్ర గాయాలతో కొన ఊపిరితో వున్న సుమారు 40 సంవత్సరాల వయసుకలిగిన వ్యక్తి ని గమనించిన స్థానికులు 108 కు తెలియజేసిన వెంటనే పలాస 108 సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని ప్రధమ చికిత్స అందించిన తరువాత పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు.తలకు తీవ్ర గాయం కావడంతో వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడని వైద్యులు తెలియజేయగా, వేకువఝామున గుర్తు తెలియని రైలు నుండి వ్యక్తి జారిపడి ఉండొచ్చని భావిస్తున్నారు.ప్రస్తుతానికి క్షతగాత్రుడు అపస్మారకస్థితిలో ఉన్నాడని, మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు.సమయానికి స్పందించి మానవతను చాటుకున్న పలాస 108 సిబ్బంది సత్యం,సురేష్ ల సేవలను పలువురు ప్రశంసించారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment