
ఏలూరు :- జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం దెందులూరు నియోజకవర్గంలో అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. శాఖలు, మండలాలు వారీగా సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలుపై సుదీర్ఘంగా సమీక్షించి,పెండింగులో ఉన్న పనులు నిర్ణీత సమయంలోగా పూర్తిచెయ్యాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో పంచాయతీ రాజ్,రహదారులు,భవనాలు శాఖ ద్వారా మంజూరైన రోడ్లు,భవనాలు నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశించిన సమయంలోగా పూర్తి చెయ్యాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్, ఆర్ డబ్ల్యూఎస్, జలధార – జలహారతి కార్యక్రమాలు ద్వారా మంజూరు అయిన పనులు పూర్తిచెయ్యాలని అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు.పాఠశాలలు తెరిచేనాటికి త్రాగునీరు,టాయిలెట్లు,విద్యుత్తు రిపేర్లు, మౌళిక సదుపాయాలలో లోటుపాట్లు ఉంటే సరిచేసు కోవాలని సూచించారు.అలాగే అంగన్వాడీ కేంద్రాలలో త్రాగునీరు, టాయిలెట్లు, తదితర మౌళిక సదుపాయాలు పక్కాగా ఉండేలా చూడాలన్నారు.నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన నిరుపేదలకు స్వంత ఇల్లు అందించేలా చర్యలు తీసుకోవాలని,నిర్మాణ దశలో ఉన్న ఇండ్లను వెంటనే పూర్తిచెసి గృహప్రవేశాలకు సిద్ధం చెయ్యాలని అన్నారు.ఇంటింటికీ వెళ్ళి పొడి,తడి చెత్తను సేకరించి రోడ్లపై చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. క్రమం తప్పకుండా డ్రైన్లలో పూడిక తీసి మురుగునీరు పారేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి కుటుంబానికి,గ్రామానికి చేరేలా అధికారులు ప్రత్యేక కృషి చెయ్యాలని అన్నారు.రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు,రోడ్డు అండర్ బ్రిడ్జిలు,బ్రిడ్జిలు పనులు వేగవంతం చెయ్యాలని అన్నారు.ముఖ్యంగా గృహనిర్మాణ,తాగునీటి సరఫరా,రహదారులు అభివృద్ధి,విద్యా మరియు వైద్యసదుపాయాలు మెరుగుదలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేసి ప్రజలకు వాడుకలోకి తీసుకురావాలని అన్నారు.నాణ్యతలో ఎటువంటి రాజీ ఉండకూడదని,ఆలస్యమైన పనులను గుర్తించి అవసరమైతే కాంట్రాక్టరును మార్చాలన్నారు.ప్రజలు మనోభావాలకు అనుగుణంగా చేస్తున్న పాలనకు అధికారులు తోడుగా ఉండాలని కోరారు.ప్రతి శాఖ అధికారులు తమ పరిధిలో జరుగుచున్న పనులుపై పూర్తి అవగాహన ఉండాలని,క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడ లోటుగా జరుగుతున్నాయో అక్కడ ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. ప్రజలు నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.విద్యుత్తుశాఖ వారు చెట్టుతొలగించే కార్యక్రమాలు చేస్తున్నారని,స్థానిక తహశీల్దారు పర్మిషను లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువచ్చారు.నియోజకవర్గంలో సమయానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు రావడం లేదని, ముఖ్యమైన చోట్ల బస్సులు ఆపుచేయుటలేదని ప్రజలు, విద్యార్థులు స్వయంగా నాకే ఫోన్లు చేస్తున్నారని తెలిపారు.ఈ సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని,పాఠశాలలు తెరిచేనాటికి విద్యార్థులు సమస్యలు పూర్తిపరిష్కారం చూపాలని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలు,వసతి గృహాలు,అంగన్వాడి సెంటర్లో ఉన్న టాయిలెట్స్,మౌళిక సదుపాయాలు,ఉన్నలోటుపాట్లు పరిష్కారం చూపాలని అన్నారు.డ్వాక్రా భవనాలు పూర్తి చెయ్యాలని సూచించారు.నియోజకవర్గంలో సూర్యఘర్ లో మొదటిస్థానంలో ఉన్నామని,ఎస్సీ,ఎస్టీ నూరుశాతం సబ్సిడీతో కార్యక్రమాలు దెందులూరులో నాతో కేవలం రెండు గృహాలకు మాత్రమే ప్రారంభోత్సవం చేయించారని అన్నారు.ఎస్సీ,ఎస్టీ వారికి ఈ పథకాన్ని అమలు చెయ్యడంలో విద్యుత్తు శాఖ వెనుకబడి పోయిందని,అర్హులు అందరికీ ఈ పథకం అందేలా చూడాలని అన్నారు.



