“హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం”…వైసీపీ జిల్లా అధ్యక్షులు కె.కె.రాజు ధ్వజం..

పార్టీ ఐడీ కార్డుతో ప్రతి కార్యకర్తకు గుర్తింపు.
త్వరలో కమిటీల ఏర్పాటు.
25వ వార్డు వైసీపీ నాయకులు,కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం…

విశాఖ సిటీ :- ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని,అనతికాలంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె. రాజు ధ్వజమెత్తారు.సీతంపేట వెన్నెల ఫంక్షన్ హాల్‌లో 25వ వార్డు అధ్యక్షులు మువ్వల పోలరావు ఆధ్వర్యంలో జరిగిన వైసీపీ 25వ వార్డు నాయకులు,కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కె.కె. రాజు మాట్లాడుతూ, “అమరావతి అభివృద్ధి పేరుతో వేలకోట్ల ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం లూటీ చేస్తోంది. రానున్న కాలంలో వైసీపీ క్యాడర్ నేరుగా జగన్ గారితో మమేకమయ్యే విధంగా పార్టీ కమిటీలను నిర్మిస్తాం. వైసీపీలో ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుంది. పార్టీ ఐడీ కార్డుతో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తాం” అని స్పష్టం చేశారు.”వార్డులోని ప్రతి వైసీపీ కార్యకర్త కూటమి ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరించాలి. రానున్న రోజుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ జోన్-1 జి.వి.రవిరాజు, వై. సునీల్, కర్రీ మురళీకృష్ణ రెడ్డి,దల్లి రామకృష్ణ రెడ్డి, భోగవల్లి గోవింద్, శ్రావణ్ కుమార్,నూకరాజు, మువ్వల సంతోష్, సారిపల్లి సంతోష్, గుదే రాజు, హరికృష్ణ, బోర గోవింద్, స్వర్ణపూడి సత్యనారాయణ, జోరీగల గణేష్, బొమ్మాలి రవి, అప్పలరాజు,నాగు,పవన్,జామి రాజు,అశోక్,రవీంద్ర,శివ,ఉమా,వీరమ్మ,మణి,పావని తదితర ముఖ్య నాయకులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment