
పెదబయలు :- ముంచంగిపుట్టు మండలం పనసపుట్టు గ్రామపంచాయతీ పరిధిలోని అతిపెద్ద గ్రామమైన కడుతులలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర ఆదివారం శాశ్వత పరిష్కారం చూపారు. గతంలోని జిల్లా పరిషత్ నుంచి ఐదు లక్షలు, జల్ జీవన్ మిషన్ నుంచి రూ.6 లక్షలు,ప్రత్యేక నిధుల నుంచి రూ.18 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. కానీ అది సక్రమంగా పనిచేయకపోవడంతో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి .ఈ సమస్య పరిష్కారం కోసం జిల్లా పరిషత్ నుంచి మరో చేతి పంపును కూడా మంజూరు చేసి ఏర్పాటు చేశారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులంతా జడ్పీ చైర్పర్సన్ సుభద్ర దృష్టికి తీసుకువెళ్లారు. తాగేటి కోసం సుమారు కిలోమీటర్ దూరం నడిచి వెళ్లాల్సి వస్తుందని వారి ఆమెకు విన్నవించారు.వెంటనే ఆమె స్పందించి ఆదివారం ఆ గ్రామంలో పర్యటించి గ్రామీణ తాగునీటి శాఖ, విద్యుత్ శాఖ, గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వారందరినీ సమన్వయం చేసి నాలుగైదు రోజుల్లో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.గ్రామంలో ప్రతి వీధికి, ప్రతి ఇంటికి తాగునీరు వెళ్లే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. కెపాసిటీ పెంపు కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు విద్యుత్ అధికారులతోనూ తాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామీణ తాగునీటి శాఖతో సమన్వయం చేసే సమస్యను పరిష్కరించారు.భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతం కాకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు…



