
నెల్లిమర్ల :- పదోతరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఘనంగా సత్కరించారు.విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రశంసా పత్రం,మెడల్ అందించి,దుశ్సాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమం ద్వారా ఉన్నత చదువుల వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులకు ఆమె మరింత భరోసా కల్పించారు.ఆదివారం భోగాపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పూసపాటిరేగ, భోగాపురం,నెల్లిమర్ల,డెంకాడ మండలాలకు చెందిన టాపర్లకు ఎమ్మెల్యే మాధవి స్వహస్తాలతో ఈ ప్రోత్సాహకాలను అందజేశారు.
పంచాయతీకి ఇద్దరు విద్యార్థుల చొప్పున ఎంపిక..
పూసపాటిరేగ మండలంలోని 28 పంచాయతీలను ప్రాతిపదికగా తీసుకుని, ప్రతి పంచాయతీ నుంచి అత్యధిక మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థుల చొప్పున ఎంపిక చేశారు.విజేతలుగా నిలిచిన ప్రతి విద్యార్థికి రూ.4 వేలు నగదు ప్రోత్సాహకాన్ని అందించారు.దీంతో పాటుఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,జనసేన అధినేత పవన్ కళ్యాణ్,ఎమ్మెల్యే లోకం నాగ మాధవిల చిత్రాలతో కూడిన ప్రత్యేక ప్రశంసా పత్రం.
జ్ఞాపిక (మెడల్) దుశ్సాలువ సత్కారం చేశారు.నియోజకవర్గంలోని యువతలో ఆత్మస్థైర్యాన్ని,ఉత్సాహాన్ని నింపేందుకు జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తోంది.పదో తరగతి విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఈ నగదు పురస్కారాలను అందజేయడం విశేషం.రాజకీయ ప్రముఖుల సమక్షంలో..
జనసేన పార్టీ ప్రముఖ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.కార్యక్రమంలో జనసేననాయకులు,కొవ్వాడ అగ్రహారం మాజీ సర్పంచి కోట్ల రఘు, జమరాజు,బాసి దుర్గలతో పాటు వివిధ పంచాయతీలకు చెందిన జనసేన నాయకులు,కార్యకర్తలు,విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.తమ పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి, జనసేన పార్టీకి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు…



