
40 మందికి తక్షణ సహాయం…
పలాస :- కంచిలి మండలం బూరగాం సమీపంలో శనివారం అర్ధరాత్రి ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన సుమారు 40 మంది యాత్రికులు కాశీ యాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.సమాచారం అందుకున్న కంచిలి ఎస్సై పి. పారి నాయుడు తన సిబ్బందితో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు, యాత్రికులకు ఇబ్బందులు పడకుండా తాత్కాలిక వసతి,భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.పోలీసుల మానవత్వంతో కూడిన స్పందనపై యాత్రికులు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలకు కష్టసమయంలో భరోసా కల్పించడం పోలీసుల బాధ్యతేనని అన్నారు.పోలీసులు సేవలకు పలువురు అభినందించారు…



