
శ్రీకాకుళం జిల్లా రణస్థలం :- ఎచ్చెర్ల నియోజకవర్గం నడుకుదిటి తేజ బాబు ఆధ్వర్యంలో,నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం రెండు రోజులు జరిగింది. ఎచ్చెర్ల శాసనసభ్యులు శ్రీ నడుకుదిటి ఈశ్వరరావు గారి అధ్యక్షతన,నిర్వహించిన రెండో రోజు కార్యక్రమానికి రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మధుకర్ జీ గారు,విశిష్ట అతిథిగా హాజరై సభ్యులకు మార్గనిర్దేశం చేశారు.క్షేత్రస్థాయిలో సభ్యుల పనితీరు,ప్రజల సమస్యల గుర్తింపు,వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత అవగాహన కల్పించారు.సమాజంలో ఎదురయ్యే అనేక సవాళ్లను అధిగమిస్తూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సాగాలన్నారు.ప్రజాసేవే పరమావధిగా భావించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఎచ్చెర్ల శాసనసభ్యులు శ్రీ నడుకుదిటి ఈశ్వర రావు గారు మాట్లాడుతూ,రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణ శిబిరం సభ్యుల్లో ఆత్మవిశ్వాసం,నాయకత్వ లక్షణాలు,సేవా దృక్పథాన్ని మరింత పెంపొందించేలా జరిగిందన్నారు.క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను అర్థం చేసుకుని,బాధ్యతాయుతంగా పనిచేయడానికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సమాజాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నాయకులు,మండల నాయకులు పాల్గొన్నారు…



