
పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు…
అనకాపల్లి రూరల్ :- అనకాపల్లి పట్టణంలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాలు పలుచోట్ల గురువారం నిర్వహించారు.ముఖ్యంగా స్థానిక గూడ్స్ రోడ్డు అల్లూరి సీతారామరాజు వద్ద అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్,సర్వేజనా ఐక్యవేదిక వ్యవస్థాపకులు కోరిబిల్లి పరి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధులు మన్యం వీరుడు,విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు గారి 102,వ వర్ధంతి సందర్భంగా గూడ్స్ రోడ్డులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు,పేదలకు దుప్పట్ల,మహిళలకు చీరలు పంపిణీ జరిగింది.ఈ కార్యక్రమంలో డీవీఎంసీ మెంబర్ రేభాక మధుబాబు, చింతా లక్ష్మణరావు, ఓరిగంటి నాగమణి, బిజెపి సీనియర్ నాయకులు వుడా రమేష్,మారిశెట్టి భాస్కరరావు,, సంతోష్, కనకమహాలక్ష్మి, శేషు, నర్సింగ్ యాదవ్,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.



