
తెనాలి :- మండలంలోని సోమ సుందరపాలెం లోని ఆటోనగర్లో కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి.దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

