రాజమహేంద్రవరంలో ఫుడ్ సేఫ్టీ శిక్షణ తరగతులు నిర్వహణ…

ఆహార వ్యాపారస్తులకి ఆహార భద్రతపై శిక్షణ ఎంతో అవసరం
ట్రైనర్ కలకండ ప్రవీణ్ కుమార్…

రాజమహేంద్రవరం :- ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ప్రతి వ్యాపారస్తుడు ఆహార భద్రతపై అవగాహన కలిగి ఉండటం అత్యవసర మని భావిస్తూ,2017 నుంచి ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీ కన్య కన్వెన్షన్ హాల్లో ఈ నెల 11, 12, 13 తేదీలలో శిక్షణా తరగతులు నిర్వహించారు.ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేషన్ ఆదేశాల మేరకు,ఏపీ పోస్టాక్ నోడల్ ఆఫీసర్ వేణుగోపాలరావు సూచనలతో,అదే విధంగా రాజమహేంద్రవరం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నందజి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలోని పలు హోటల్స్, కిరాణా వ్యాపారస్తులకు శిక్షణా తరగతులు నిర్వహించారు.ఈ శిక్షణ తరగతులకు శిక్షకుడు కలకండ ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడారు.ఆహార తయారీ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు, సరైన విధానాల గురించి వివరంగా సూచనలు అందించారు.ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడం ప్రతి వ్యాపారస్తుడి బాధ్యత అన్నారు.అనంతరం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం ప్రతి వ్యాపారస్తుడు ఫుడ్ లైసెన్స్ తప్పని సరిగా తీసుకుని వ్యాపారం చేయాలని తెలిపారు. ఆహార తయారీ విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని తయారు చేయాలనే దానిపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఫుడ్ లైసెన్స్ పొందాలనుకునే వ్యాపారస్తులు ఫుడ్ సేఫ్టీ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం జోనల్ హెడ్ ఆనంద్ కృష్ణారావు,కోన వెంకటేశ్వర్లు,ప్రసాద్,పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment