టీడీపీ సమన్వయకర్తగా పార్టీని మరింత బలోపేతం చేస్తా – ఎమ్మెల్యే ఆరిమిల్లి…

తణుకు :- టీడీపీ సమన్వయకర్తగా లోక్ సభ స్థానాల జోనల్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలను అప్పగించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే ఆరిమిల్లి
తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఇటీవల కొంతమంది నాయకుల నియామకం ద్వారా వారు పర్యవేక్షించాల్సిన లోక్ సభ నియోజకవర్గాల్ని కేటాయించారు.అందులో భాగంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కు శ్రీకాకుళం ,విజయనగరం అరకు పార్లమెంట్ స్థానాల జోనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
తనకు కేటాయించిన లోక్ సభ స్థానాలకు సంబంధించి,క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితుల్ని గమనిస్తూ,నాయకుల్ని సమన్వయం చేస్తూ,అగ్రనాయకత్వానికి,క్షేత్రస్థాయి నాయకులకు మధ్య ప్రధాన సంధానకర్త గా వ్యవహరిస్తాననీ,జోనల్ కోఆర్డినేటర్ గా నియమించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ,నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలుపుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment