
బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్న – ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం
తిరుపతి :- నాగలాపురం మండలంలో జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ వారి బృందం మరియు స్థానిక శాసన సభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం వారి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తదనంతరం ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం మరియు జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి బడి పిలుస్తోంది కార్యక్రమంను ప్రారంభించారు.విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకోవాలని సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు తెలిపారు.ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు సన్మానం చేశారు బడి పిలుస్తుంది కార్యక్రమమును సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం మరియు జిల్లా విద్యాశాఖ అధికారి జెండా ఊపి ర్యాలీ చేపట్టారు.ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి నాగలాపురంలోని గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
కార్యక్రమమునకు మండలం లోని ఎం ఇ ఒ -1, ఎం ఇ ఒ -2 ఎంపిడిఓ, ఎం ఆర్ ఒ , ఎన్డీయే కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, అన్నిశాఖల మండల అధికారులు మరియు గ్రామ స్థాయి అధికారులు, వివిధ స్థాయి సంఘాల ప్రతినిధులు, మాజీ సర్పంచ్ లు, కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు హాజరైనారు .


