14 న శ్రీ రామచంద్రమ్మ అమ్మవారి మెరుపులు…

ఎలమంచిలి టౌన్ :- ఎలమంచిలి గ్రామ దేవత శ్రీ రామచంద్రమ్మ అమ్మవారి పుట్టుక మహోత్సవం మెరుపులు పండగ 14వ తేదీ గురువారం నాడు జరిపించేందుకు ఆలయ నిర్వహణ కమిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది. 400 సంవత్సరాలు చరిత్ర కలిగిన గ్రామ దేవత శ్రీ రామచంద్రమ్మ తల్లి దేవస్థానం ప్రజల భక్తి విశ్వాసంతో వెలుగొందుతుంది. రెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే పుట్టుక మహోత్సవంలో అమ్మవారు అర్ధరాత్రి 12 గంటలకు మెరుపుల రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఇదే రోజు అమ్మవారి గుడి వద్ద భారీ బాణసంచా వెలిగించి, అమ్మవారి పుట్టక చదివి అమ్మవారిని పిలిస్తే మూడుసార్లు మెరుపు రూపంలో అమ్మవారు ప్రజలకు దర్శనం ఇవ్వడం అమ్మవారి యొక్క నిదర్శనం, భక్తులు యొక్క అనుభూతి వేల సంఖ్యలో భక్తుల హాజరై ఈ మెరుపులను కనులారా తిలకిస్తారు. 14వ తేదీ గురువారం కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కరుణాకటాక్షాలు పొందుతారని ఆలయ కమిటీ వారు ఆడారి శంకరరావు, కోరుమిల్లి సుబ్బారావు, రావి నూకరాజు లు కోరారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment