
అరకులోయ :- అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆంధ్ర యూనివర్సిటీ దూరవిద్య యూజీ మరియు పీజీ పరీక్ష కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ నుండిఅనుమతులు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ పట్టాసి చలపతిరావు తెలిపారు.సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్ష కేంద్రం కోడ్ 167ను ప్రభుత్వ మహిళ డిగ్రీకళాశాలకుకేటాయించారన్నారు. విద్యాసంవత్సరం 2026 -2027 నుండి యూజీ థియరీ పరీక్షలు బి ఏ, బీకాం మరియు బిఎస్సీ మరియు ప్రాక్టికల్ పరీక్షలుపీజీ థియరీ పరీక్షలను అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రంగా నిర్వహించుకొనుటకు అనుమతులను మంజూరు చేసిన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ అలాగే సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ డి.అప్పలనాయుడు ఆంధ్ర యూనివర్సిటీ అధికారులకు ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు.అరకులోయ ప్రాంతంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ రావడంతో మరింతమంది గిరిజన యువతి యువకులు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యాభివృద్ధిని కొనసాగించవచ్చని అరకులోయ అల్లూరి సీతారామరాజు జిల్లా యువతీ యువకులు ఈ సదవకాశాన్నివినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మంజూరు చేసిన అధికారులకు కళాశాల సిబ్బంది శశి కుమార్, బలరాం ప్రసాద్ సుభాన్, బాలరాజు,ధర్మారావు,స్వర్ణలత,నాగేశ్వరరావు,మురళీకృష్ణ,అఖిల్ శోభన్,ప్రణీత,అన్నపూర్ణ,లాలి కుమారి,సంధ్య,శ్రావణి,సరస్వతి,విద్యా రాణి,అజయ్ పాల్,ప్రసాద్ కళాశాల భోజనేతర సిబ్బంది. గోపాలకృష్ణ,చంటిబాబు,సుందర్రావు,రాయల్ రీచా,సంగీతసీమోన్ తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు…



